ఓ అమ్మాయి తన ఫ్రెండ్ కోసం చేసిన త్యాగానికి దేశవ్యాఫంగా అభినందనలు అందుకుంటుంది. ఆ వివరాలలోకి వెళితే.. తమిళనాడులో రాష్ట్ర మెడికల్, డెంటల్ కౌన్సెలింగ్ సందర్భంగా.. సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. త్రిచిలోని సమయపురానికి చెందిన వర్షిణి, జనని అనే ఇద్దరు అమ్మాయిలు.. ఎల్‌.కే.జీ నుంచి ఫ్రెండ్స్. డాక్టర్ కావాలని చిన్నతనం నుంచే ఇద్దరూ కలలుగనేవారు. అందుకోసం మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయగా.. ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లల కోటాలో ఇద్దరూ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు చెన్నై వచ్చారు.

వర్షిణికి కాస్త మెరుగైన ర్యాంక్ రావడంతో ఆమెను ముందుగా కౌన్సెలింగ్ లోకి పిలిచారు. జనని కూడా ఆమె వెనుకే ఉన్నా.. ఆ కోటాలో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక సీటు మాత్రమే అందుబాటులో ఉంది. అలానే ఇద్దరి మధ్య కేవలం 0.25 మార్కుల తేడా మాత్రమే ఉంది. వెనుకబడిన వర్గానికి చెందిన వర్షిణికి సీటును కేటాయిస్తే.. జననికి నిరాశ తప్పదు. అందుకు తాను సీటు తీసుకుంటే.. జననికి సీటు రాదని భావించిన వర్షిణి.. ఏకంగా మద్రాస్ మెడికల్ కాలేజీ సీటును వదులుకుంది. దీనితో ఆమె వెనుకే ఉన్న జనానికి సీటు ఖరారు అయింది.

కౌన్సెలింగ్ నుంచి ఎందుకు తప్పుకున్నావని.. వర్షిణిని అడుగగా, తనకు దీనితో పాటు బీసీ కేటగిరీలోనూ రిజర్వేషన్ ఉన్నందున జనరల్ కౌన్సెలింగ్‌ లో కూడా సీటు పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కానీ తన ఫ్రెండ్‌కి ఆ ఛాన్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. అలా చేయక పోతే.. తన స్నేహితురాలు ఈ ఏడాది ఎం.బీ.బీ.ఎస్‌.లో చేరే అవకాశం కోల్పోతుందని సమాధానం ఇచ్చింది. తన స్నేహితురాలి నిర్ణయంపై జనని అమితానందాన్ని వ్యక్తం చేసింది. ఫ్రెండ్ కోసం త్యాగం చేసిన హర్షినికి దేశవ్యాఫంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. జనరల్ కేటగిరీలో ఈ రోజు నుండి 25 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. మరి ఫ్రెండ్ కోసం హ్యాగం చేసిన వర్షిణి కి కూడా సీటు దొరకాలని వర్షిణి కి విషెస్ చెబుదాం..

No comments:

Post a Comment