*రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌
*అదే ప్రమాదంలో తండ్రి మృతి.. 
తల్లి ఆస్పత్రిలో
*పాప అవయవాలను దానం చేసిన కుటుంబసభ్యులు
*భౌతిక కాయం ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి…


ముద్దులు మూటగట్టే చిన్నారి.. అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా పుణ్యస్నానానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌ డెడ్‌ అయింది. ఆ పాప తండ్రి చనిపోగా.. తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబసభ్యులు ఆ చిన్నారి అవయవాలను దానం చేసి, ఆమె శరీరాన్ని వైద్య కళాశాలకు ఇచ్చేశారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన ముక్కా గోపీనాథ్‌ (35), రూప (30) దంపతుల కుమార్తె మనస్విని (8). స్థానిక ప్రెజెంటేషన్‌ స్కూల్లో 4వ తరగతి చదువుతోందా పాప. తిరుగు ప్రయాణమై వస్తుండగా.. పోచంపాడు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌లో గోపీనాథ్‌, రాజేష్‌ చనిపోగా.. రూప తీవ్రగాయాలతో సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే యాక్సిడెంట్‌లో తీవ్రగాయాలపాలైన మనస్వినిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెను బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు.

లయన్స్‌క్లబ్‌ సభ్యులు ఆమె కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవాలను దానం చేయడంతోపాటు.. పాప భౌతిక కాయాన్ని కూడా వైద్యవిద్యార్థులకు ఇచ్చేందుకు మనస్విని తాత రాజయ్య ముందుకొచ్చారు. దీంతో శనివారం ఆ చిన్నారి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు గుండె కవాటాలను జీవన్‌దాన్‌ ద్వారా దానం చేసినట్లు బాబాయ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ఆమె భౌతిక కాయాన్ని ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి దానం చేశారు. మనస్విని అవయవాలను వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అయిదుగురికి అమర్చినట్లు జీవన్‌దాన్‌ పీఆర్వో అనూరాధ వివరించారు.

ఆ చిట్టి తల్లి కుటుంబ సభ్యులకు 
నా పాదాభివందనాలు.

అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చిన్నవిషయంకాదు.

మనస్విని చనిపోలేదు మనందరిలోను బ్రతికే ఉంది.ముఖ్యంగా వాళ్ళ ఐదుగురిలోనూ....

No comments:

Post a Comment