* ఎం.ఎస్.ఓ లు రాజకీయనాయుకులకు బలి అవ్వబోతున్నారా..??
* రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25లక్షల కనెక్షన్లుపై వచ్చే ఆదాయాన్ని ఎం.ఎస్.ఓ.లు కోల్పోనున్నారా..??
* ఒక్కో కనెక్షన్ కు సగటున 150రూపాయల చొప్పున 37కోట్ల నష్టపోతున్నారా.??
*కేబుల్ ఆపరేటర్లు ఆదాయం కోల్పోవడం ఖాయమా..??
*దీన్ని అవకాసంగా తీసుకొని డిష్ నెట్ వర్కుల యాజమాన్యాలు లాభాలు పొందబోతున్నారా..??
*ఇదే జరిగితే ఎం.ఎస్.ఓ. లు పరిస్థిఏమిటి..??

సీఎం చంద్రబాబుకు, కేబుల్ ఆపరేటర్లకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ షాక్ ఇవ్వనుందట. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గతంలో NTV ప్రసారాలను అడ్డుకుని దారిలోకి తెచ్చుకున్న టీడీపీ ఇదే ప్లాన్ ఇప్పుడు సాక్షి ఛానల్ పై ప్రయోగించింది. సాక్షి ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసింది. అయితే అధికార పార్టీ మైండ్ బ్లాక్ చేసేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులందరితో కేబుల్ ఆపరేటర్లకు సెటప్ బాక్సులను వెనక్కు ఇప్పించేందుకు స్కెచ్ రెఢీ చేసింది. ఒక్కో మండలంలో కనీసం 5వేలమంది స్పందిస్తారని అంచనా వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25లక్షల కనెక్షన్లుపై వచ్చే ఆదాయాన్ని ఎం.ఎస్.ఓ.లు కోల్పోనున్నారు. ఇదే జరిగితే ఒక్కో కనెక్షన్ కు సగటున 150రూపాయల చొప్పున 37కోట్ల 50లక్షలు ఆపరేటర్లు ఆదాయం కోల్పోవడం ఖాయం. ఇదే సమయంలో డిష్ నెట్ వర్కుల యాజమాన్యాలతో మాట్లాడి డీల్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి 25లక్షల కనెక్షన్లు వస్తాయంటే ఏ డిష్ నెట్ వర్క్ అయినా ఎగిరి గంతెయ్యడం ఖాయం. ఇప్పుడు ఈ డీల్ ను దక్కించుకునేందుకు అందరూ పోటీపడుతున్నారు. ఇదే జరిగితే ఇకముందు ఏ ఎం.ఎస్.ఓ. న్యూస్ ఛానల్స్ ప్రసారాలను నిలిపివేసే సాహసం చెయ్యరని కొందరి అభిప్రాయం. ఏంజరుగుతుందో వేచిచూడాల్సిందే..??

No comments:

Post a Comment