నాగ్ పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంతలు ఇద్దరూ ప్రేమించుకున్నారనీ, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంటే కొత్తగా మరో టాపిక్ ఫిలిమ్ నగర్ లో చక్కెర్లు కొడుతోంది. అదేంటయా అంటే…. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. తనకు ఎంతోకాలంగా తెలిసిన అమ్మాయితోనే అఖిల్ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఫిలిమ్ నగర్ జనం చెప్పుకుంటున్నారు. కాగా ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా అక్కినేని నాగార్జున కుటుంబానికి బాగా తెలిసినవారేనని అంటున్నారు. ఆ అమ్మాయి న్యూయార్కులో ఉంటుందట. అంతకుమించి ఒక్క ముక్క కూడా బయటకు రావడంలేదు. ఇదే నిజమైతే సాధ్యమైనంత త్వరగా చైతూ-సమంతల పెళ్లి చేసేయాలేమో కదూ… మరి నాగ్ ఫ్యామిలీ ఏం చేస్తుందో…?

No comments:

Post a Comment