ప‌నివాళ్ల‌తో, అసిస్టెంట్ల‌తో.. ఒక్కోసారి అధికారుల‌తోనే త‌మ బూట్లు తొడిగించుకునే వీఐపీలను ఎంతోమందిని చూసుంటాం. కానీ వీఐపీ రాజ్‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌న్న ఉద్దేశంతో కార్ల‌పై ఉన్న ఎర్ర‌బుగ్గ‌ల‌ను తొల‌గించాల‌ని ఆదేశించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. ఈ విష‌యంలోనూ ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

కేదార్‌నాథ్ ఆల‌యంలో రుద్రాభిషేకం చేయించ‌డానికి ఇవాళ వ‌చ్చిన మోదీ.. గుడిలోకి వెళ్ల‌డానికి బూట్లు విప్పుతుండ‌గా ఓ వ్య‌క్తి సాయం చేయ‌డానికి ముందుకొచ్చాడు. మోదీ బూట్లు విప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ ప్ర‌ధాని మాత్రం వెంట‌నే వ‌ద్ద‌ని వారించారు.

నిబంధ‌న‌లు పెట్ట‌డ‌మే కాదు.. వాటిని తానే ఆచ‌రించి ఆద‌ర్శంగా నిల‌వ‌డంలోనూ మోదీ ముందుంటున్నారు.

 కేదార్‌నాథ్‌లో రుద్రాభిషేకం చేసిన తొలి ప్ర‌ధానిగా కూడా మోదీ నిలిచారు.

అభిషేకం త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అక్క‌డున్న 2500 మంది భ‌క్తుల‌తో ముచ్చ‌టించారు. ప్ర‌తి ఏడాది జ‌రిగే చార్‌ధామ్ యాత్ర‌లో కేదార్‌నాథ్ ఆల‌య ద‌ర్శ‌నం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్న‌ది.

No comments:

Post a Comment