* తీరు మారకపోతే నీరు కరువౌతుంది
నీరు కరువైపోతే బ్రతుకు బరువౌతుంది

* ఎండ వేడికి మండి నీళ్ళ చెరువెండింది
గుటక నీరులేక గుండె చెరువయ్యింది

* బోరుమని ఏడ్చిన బోరులో నీరేది
మారమని చెప్పిన మనిషిలో మార్పేది

* పంట తడి లేకుండ ఎండి పోతున్నది
కంటతడి వద్దన్న ఆగనంటున్నది

* ఊట బావులలోన నీటి మాటే లేదు
మూగ ప్రాణుల చూడ నోటి మాటేరాదు

* వాన నీరుపారి సంద్రాన చేరితే
శోక సంద్రముకాక మిగిలేది ఏముంది

* మంచినీటిలోన మంచెపుడో పోయింది
నీరుంటే చాలనే రోజు నేడొచ్చింది

* స్నానమాడెటపుడు జ్ణానమెరిగుండు
నీరు పన్నీరయ్యే రోజు పొంచుండు

* నీటి వాడుకపైన అదుపు సాధించు
పొదుపుగా వాడుకొని నువ్వు జీవించు.

No comments:

Post a Comment