ఈనెల 1 న.. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు.. అవతలరోడ్డుపై వెళ్తున్న మరో కారుపైకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో విదేశాలకు వెళ్లాల్సిన రాజేష్ అనే యువకుడు స్పాట్ లోనే చనిపోయాడు. అతని తల్లికి వెన్నముక విరిగింది. స్కూల్ నుంచి తమతో పాటు తీసుకెళ్తున్న రాజేష్ అన్న కూతురు.. రమ్య తీవ్రగాయాలతో కేర్ ఆసుపత్రిలో చేరి… తొమ్మిదిరోజుల తరువాత నిన్నరాత్రి తుదిశ్వాస విడిచింది.

ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ రోదన అందరినీ కదిలిచింది. చేతికొచ్చిన తమ్ముడు… కన్నకూతురు చనిపోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను చివరి చూపుచూసుకునేందుకు వచ్చిన రమ్య తల్లి రాధిక వేదన చూసి అందరూ చలించిపోయారు. తమ కుటుంబంలో విషాదం నింపినవారిపై కఠిన చర్యలు 
ఇక రమ్య డెడ్ బాడీకి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు, అక్కడ్నుంచి డీడీ కాలనీలో ఇంటికి తరలించారు. బంధువులు, అయినవారి చివరిచూపులు పూర్తయ్యాక అంబర్ పేట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
రమ్య కేసును సీరియస్ గా తీసుకున్నామన్నారు పోలీసులు. ఘటనలో ప్రధాన నిందితుడు షావెల్ ను రిమాండ్ కు పంపించామన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న షావెల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తాగి డ్రైవ్ చేసినందుకు 304 పార్ట్ 2 కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామన్నారు. చిన్నారి రమ్యకు జరిగిన అన్యాయం మరొకరికి జరుగకుండా ఉండాలంటే… ఆరుగురు యువకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు చిన్నారి కుటుంబసభ్యులు.