పంచదారకు దూరం: ఉదయం వేళల్లో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి శరీరానికి ఉంటుంది. కానీ రాత్రివేళల్లో ఆ శక్తిని కోల్పోతుంది. కాబట్టి రాత్రిపూట తీపి పదార్థాలకు నో చెప్పడం మంచిది. - స్నాక్స్: నైట్ షిఫ్ట్స్ లో నిద్ర కామన్ సమస్య. దాన్ని ఆపుకోవడానికి రకరకాల స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే నూనెలో వేయించిన డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తీసుకోకుండా ఉండాలి. అవి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతాయి. దీనివల్ల ఊబకాయం సమస్య ఎదురవుతుంది. కాబట్టి అలాంటి స్నాక్స్ కి బదులు క్యారెట్, ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకోవడం మంచిది.  

 కార్బొహైడ్రేట్స్: రాత్రిపూట పనిచేసేవాళ్లకు కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారం జీర్ణమవడం కష్టం. కాబట్టి.. అన్నం, బ్రెడ్, బంగాళాదుంప, ధాన్యాలతో తయారు చేసిన ఎలాంటి వంటకానికైనా దూరంగా ఉండటం మంచిది. ఈజీగా జీర్ణమయ్యే ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఉల్లాసంగా గడిపేయవచ్చు.

కాఫీ: నిద్రను ఆపుకోవడానికి చాలా మంది వెతుక్కునే పరిష్కారం కాఫీ. నిద్రరాకూడదని.. చాలామంది టైంతో సంబంధం లేకుండా.. కాఫీ లాగించేస్తారు. కానీ కాఫీ ఎక్కువగా నైట్ షిఫ్ట్స్లో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

సాఫ్ట్ డ్రింక్స్: రాత్రివేళల్లో సాఫ్ట్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. అదికూడా పనిచేసే సమయంలో ఇలాంటివి తీసుకోకపోవడం మంచిది. దీనికి బదులు ఫ్రూట్ జ్యూస్ లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

ఆహారం: రాత్రిపూట వర్క్ చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. కాస్త విరామంతో.. కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల.. చాలా రిలాక్స్ గా ఉంటుంది. అది జీర్ణమవడానికి కూడా మంచిది. 

వాకింగ్: నైట్ షిఫ్ట్ పనిచేసే వాళ్లు తప్పకుండా చేయాల్సిన ఎఫెక్టివ్ హెల్త్ టిప్ నడక. మధ్యలో బ్రేక్ తీసుకోవడం, నడవడం వల్ల కళ్లకు, మైండ్ కి రిలాక్స్ గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచడంతో పాటు, ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది.