ఎండు ద్రాక్షలు శరీరానికి కావలసిన బలాన్నిస్తాయి. ఎండుద్రాక్షలో ఫాస్పరస్, విటమిన్ ఎ, బి1, బీ2, బీ3, బీ6, బీ12, అమినో యాసిడ్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పెరిగే పిల్లల్లో ఎండుద్రాక్ష బలాన్నిస్తాయి. ఇందులోని క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల దేహపుష్టికి రోజు నిద్రించేముందు పాలలో ఎండుద్రాక్షల్ని వేసి మరిగించి తాగించాలి. ఇలాచేస్తే శరీరానికి తగిన శక్తి లభించడంతో పాటు జీర్ణ సమస్యలు ఉండవు.గొంతునొప్పితో బాధపడేవారు పాలలో మిరియాల పొడి చిటికెడు, ఎండు ద్రాక్షల్ని వేసి మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది. గర్భిణీ మహిళలు ఎండు ద్రాక్షల్ని పాలలో వేసి తీసుకుంటే గర్భస్థ శిశువుకు ఎంతో మేలు చేకూరుతుంది. ఎండుద్రాక్షల్ని అలాగే తీసుకుంటే గుండె పల్స్ రేటు పెరుగుతుంది.

No comments:

Post a Comment