తమిళనాడు రాజకీయాల్లో జయలలిత తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎం జి రామచంద్రన్ ఆమెను రాజకీయాల్లోకి తీసుకురాగా ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతూ సవాళ్ళను ఎదుర్కొంటూ సుతిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ప్రస్థానం లో ఆమె ఎన్నో అవమానాలకు గురయ్యారు. 1989 మార్చి 25 తమిళనాడు రాజకీయాల్లో ఓ దుర్దినంగా చెప్పబడింది. ఆ రోజు నిండు సభలో ఒక స్త్రీ అని చూడకుండా దుశ్శాసన పర్వం సాగించారు. అప్పుడు జ‌య‌ల‌లిత ప్ర‌తిప‌క్ష‌నేత‌గా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డీఎంకే అధినేత క‌రుణానిధి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.


క‌రుణానిధి స‌భ‌కు హాజ‌రుకాక‌పోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ క‌రుణానిధి ఎందుకు అసెంబ్లీకి రావ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. గ‌తంలో ఎమ్‌జీఆర్‌, మీరు కూడా శాస‌న‌స‌భ‌కు గైర్హాజ‌ర‌య్యారుగా అంటూ డీఎంకే స‌భ్యులు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అప్ప‌టి క‌రుణానిధి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న దురై మురుగ‌న్ త‌న చీర‌ను లాగిన‌ట్లుగా ప‌లు ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు జ‌య‌ల‌లిత‌. దీంతో ఆమె స‌భ‌నుంచి బ‌య‌ట‌కొచ్చి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాతే మ‌ళ్లీ అసెంబ్లీలో అడుగు పెడుతాన‌ని శ‌ప‌థం చేశారు.

అన్న‌ట్లుగానే అధికారంలోకి వ‌చ్చారు మాట‌ను నిల‌బెట్టుకున్నారు. జ‌య‌ల‌లిత చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజంలేద‌న్నారు దురై మురుగ‌న్‌ . జ‌య‌ల‌లితే ముందు దాడికి పాల్ప‌డింద‌ని చెప్పుకొచ్చారు. క‌రుణానిధి బ‌డ్జెట్ చ‌దివేందుకు అన‌ర్హుడంటూ గ‌ట్టిగా స్లోగ‌న్స్ చేస్తూ డీఎంకే అధినేత క‌ళ్ల‌జోడును ప‌గ‌ల‌గొట్టింద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. స‌భలో ఇత‌ర అన్నాడీఎంకే స‌భ్యులను దాడిచేయాల్సిందిగా పుర‌మాయించార‌ని దురై తెలిపాడు. జ‌రిగిన మొత్తం ఎపిసోడ్ K.K.S.S. రామ‌చంద్ర‌న్‌కు తెలుస‌ని కానీ ఆయ‌న నోరు విప్పి నిజం చెప్పే ప‌రిస్థితుల్లో లేర‌ని ..ఎందుకంటే అప్ప‌టికే ఆయ‌న డీఎంకే పార్టీలో చేరార‌ని ఇంట‌ర్వ్యూలో చెప్పేది జ‌య‌ల‌లిత‌

No comments:

Post a Comment