నాగచైతన్య, సమంత చాలాకాలం నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలుసు. తొలుత తమ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గానే ఉంచాలనుకున్నారు కానీ.. అందరికీ ఎలాగోలా తెలిసిపోవడంతో వాళ్లు ఓపెన్ అయిపోయారు. అప్పటినుంచి వీరిద్దరూ విచ్చలవిడిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ జంట పెళ్ళి మాట ఎత్తడం లేదు. చైతూ కంటే చిన్నవాడైన అఖిల్‌ పెళ్ళికి సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి కానీ.. చైతూ, సమంతల పెళ్ళి విషయమై ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. ఎందుకు ఈ జంట పెళ్ళి విషయమై వెనకడుగు వేస్తోంది? అని ఆరాతీయగా.. నమ్మశక్యం కాని కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.



చైతూ, సమంతల పెళ్ళి లేట్ అవ్వడానికి కారణం.. వారి జాతకాల్లో దోషాలు ఉండడమేనని ఈమధ్యే ఓ టాక్ వినిపించింది. కానీ.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజా సమాచారం. నిజానికి.. ఈ పెళ్ళి సమంత తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదట. నలుగురిలో నవ్వుతూ కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఈ పెళ్ళికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారట. ఈ అనుమానం తెరమీదకి రావడానికి కారణం.. రీసెంట్‌గా సమంత తట్టాబుట్టా సర్దుకుని, చైతూ ఫ్లాట్‌కి ఫిష్ట్ అవ్వడం వల్లే! మొదటినుంచి ఆమె పేరెంట్స్ ఈ పెళ్లికి వ్యతిరేకంగానే ఉన్నారని, ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా.. వాళ్లనుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని, అందుకే ఆమె లగేజ్ తీసుకుని చైతూ ఫ్లాట్‌కి వచ్చేసిందని అంటున్నారు. నాగ్ ఫ్యామిలీ కూడా సమంత పేరెంట్స్‌ని ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. కానీ.. వాళ్లు మాత్రం ఓకే అనకుండా ఏవో మాటలు అల్లేస్తున్నారట.
 
మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఇది వరకే చైతూ, సమంత పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేశారట. తన పేరెంట్స్ అందుకు ఒప్పుకుంటారని చెప్పడంతో.. నాగ్ ఫ్యామిలీ వీరి పెళ్ళికి ఏర్పాట్లు కూడా ప్రారంభించారట. కానీ.. సమంత ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారట. అప్పటినుంచి వీరి పెళ్ళి లేట్ అవుతూనే వస్తోందని, ఈ తతంగం ఇంకెన్నాళ్లు సాగుతుందోనని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా.. చూడముచ్చటైనా ఈ జంట అన్ని సర్దుకుని, త్వరగా మూడుముళ్లతో ఏకం కావాలని కోరుకుందాం.

No comments:

Post a Comment