సినీ న‌టులంటే అభిమానుల‌కు ఎనలేని పిచ్చి ఉంటుంది. అయితే తమకు నచ్చినవాళ్లతో ఫొటోలు దిగడం కుదరనపుడు వాళ్లతో ఫోటోలు దిగిన‌ట్లు ఫోటో షాప్ లో మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయడం కామనే.. ఇది పెద్ద నేరమేమీ కాదు.. కానీ ఇటీవల ర‌జ‌నీకాంత్, మహాత్మగాంధీలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో ఒక‌టి వైర‌ల్ అవుతోంది..

తమ ఆరాధ్య హీరో రజనీకాంత్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి రమ్మని అభిమానులు కోరుతున్నా రజనీ పట్టించుకోకపోవడం తెలిసిందే.. ఇలా చూస్తే రజినీ అంటే పడిచ చ్చిపోయే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అసలు రజినీ, గాంధీల ఫొటోల కధ చూద్దాం..

1948లో చనిపోయిన మహాత్మా గాంధీని 1950లో పుట్టిన రజనీకాంత్‌ కలవడమేంటి? అనేది అసలు ప్రశ్న.. ఇది ఫోటోషాప్‌ మాయ. రజనీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా నుంచి ఓ స్టిల్‌ తీసుకుని దానికి మహాత్ముడిని తగిలించి సోషల్‌ మీడియాలో పెట్టేసారు. ఈ ఫోటో కింద స్వాతంత్రోద్యమంలో పాలొన్న రజనీ కాంత్ ను అభినందిస్తున్న మహాత్ముడు అని కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. ఏదేమైనా ఫొటోషాప్ మాయ ఎంత పని చేసిందో చూడండి.

No comments:

Post a Comment