ఇండస్ట్రీలో మరో షాకింగ్ న్యూస్. అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ యంగ్‌స్ట‌ర్ రాజ్‌త‌రున్ ఓ బ్యూటిఫుల్ యాంక‌ర్‌ను పెళ్లి చేసేసుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతానికి ఇది రూమ‌ర్ మాత్రంకాదు. ఎదుకంటే ఈ పెళ్లిపై జోరుగా వార్త‌లు వ‌స్తున్నా అటు రాజ్‌, ఇటు ఆ యాంక‌ర్ ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. కొద్ది నెల‌లుగా ప్రేమించుకుంటున్న వీరిద్ద‌రు శ‌నివారం ఉద‌యం సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.
ఈ వార్త‌ల‌ను క‌న్‌ఫార్మ్ చేసుకునేందుకు కొంద‌రు మీడియా వాళ్లు రాజ్‌త‌రుణ్‌, లాస్య‌ల‌ను సంప్ర‌దించాల‌ని భావిస్తే వారిద్ద‌రు అందుబాటులో లేకుండా పోయార‌ట‌. గూగుల్‌లో హైఫై జాబ్‌కు గుడ్ బై చెప్పిన లాస్య ప్ర‌స్తుతం బుల్లితెరపై లీడింగ్ యాంకర్ గా పేరుతెచ్చుకుంది. టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.
లాస్య త‌న స‌హ‌యాంక‌ర్ ర‌వితో ప్రేమ‌లో ఉంద‌న్న గుస‌గుస‌లు నిన్న‌టి వ‌ర‌కు వినిపించాయి. రవితో కలిసి ఆమె చేసి కార్యక్రమాలన్నీ మంచి టీఆర్పీ సంపాదించి పెట్టాయి. అందుకే ఆడియో ఫంక్షన్లకు కూడా రవి-లాస్యనే వ్యాఖ్యాతలుగా పెడుతుంటారు. ఈ వార్త‌లు ఇలా ఉండ‌గానే రాజ్‌త‌రుణ్‌-లాస్యకు మ‌ధ్య ఎక్క‌డ రిలేష‌న్ ఏర్ప‌డింది..అది ప్రేమ‌..చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు ఎలా వెళ్లింద‌న్నదే ఇప్పుడు ఎవ్వ‌రికి అంతుపట్ట‌డం లేదు.
వీరిద్ద‌రి ప్రేమ‌కు ఇంట్లో పెద్దోళ్లు ఒప్పుకోవడం వల్లనే వీళ్లిద్దరూ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అస‌లు ఏం జ‌రిగిందో రాజ్‌, లాస్య‌ల‌లో ఎవ‌రో ఒక‌రు నోరువిప్పితే కాని ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డేలా లేదు.

No comments:

Post a Comment