ప్రతీ ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలనే అనుకుంటారు. తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్య, పిల్లలు.... ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు. అంతా బానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమైఉండచ్చు. మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమైఉండచ్చు. ఇలాంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎం చేయాలో చూడండి..! 

ముందు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందనడానికి కారణాలు చూడండి:
* ఇంట్లోవారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
* అన్నిటికి తప్పు బడుతున్నారా? మీ ఇంట్లోవారు ఏ పని చేసిన అందులో తప్పులు వెతకడం.. లేదా మీ పై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
* తరచుగా ఎవరో ఒకరిపై చిన్న చిన్న వాటికి కంప్లైంట్ చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నిండడానికి కారణాలు ఏంటో చూడండి:
* ఇంట్లో వస్తువులు గాని, బట్టలు గాని ఎలాపడితే అల వదిలేయకూడదు. వాటిని సక్రమంగా అమర్చుకోవాలి. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
* మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయండి. చేతులో పట్టుకొని అటు ఇటు తిరిగితే నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
* మురికి బట్టలు ధరించకూడదు. వీటివల్ల క్రిములు రావడమే కాకుండా వస్తు ప్రకారం ఈ బట్టలు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
* ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురుబొదురుగా అస్సలు ఉంచకూడదు. వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగా ఉంచాలి. పక్కపక్కన పెట్టచ్చు గాని ఎదురుబొదురుగా పెడితే నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమికోట్టాలో చూడండి:
* ఓ గుప్పెడు రాయిఉప్పు లేదా దొడ్డుఉప్పుని అన్ని రూమ్ మూలలలో పెట్టండి. 48 గంటల తరువాత దాన్ని తీసేయండి. నెగటివ్ ఎనర్జీ తరిమికొట్టడంలో రాయిఉప్పు బాగా పనిచేస్తుంది. కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కలపండి.
* ఇంటిని, ఇంట్లో వస్తువులని పైపైన దులపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్.. ఇలా అన్నిటిని కనీసం రెండు వారాలకొకసారైనా శుభ్రపరుచుకోండి.
* పాత పుస్తకాలు, దుస్తులు లాంటివి ఉంచుకోకండి. కుదిరితే ఎవరికైనా దానం చేయండి. ఎంత తక్కువ వస్తువులు ఉంటె అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
* నిశాభ్ధంగా ఉంటె చాలా మందికి నచ్చుతుంది. కాని అప్పుడప్పుడు ఫుల్ సౌండ్ తో పాటలు వినడం లేదా సినిమా చూడడం లాంటివి చేస్తే నెగటివ్ ఎనర్జీ అక్కడనుండి పారిపోతుంది.
* తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఈగలొస్తాయి. దోమలోస్తాయి అని అలా చేయకుండా ఉండకండి. ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
* మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరమే కాదు... మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. దీంతో మీ ఇంటి పై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇంట్లో ఏదైనా సూర్య కాంతి పడే మంచి స్థలం చూసుకొని అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది.
* ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ కాండిల్స్ వెలిగిస్తూ ఉండాలి. ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది.
* మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎల్లపుడు ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటకి మార్చండి. సోఫాల పైన ఉన్న క్లాత్ ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
* హాల్ లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇల్లంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంట్లో చెట్లని చూస్తే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి.
* ఇంట్లో అక్కడక్క వెల్లులి రెమ్మలను తగిలించండి. ముఖ్యంగా మెయిన్ డోర్ కి తగిలిస్తే ఆత్మలు, దెయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయి.
* క్రిస్టల్స్ ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడతీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి.
ఈ విలువైన సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం మరువకండి. మీ బంధుమిత్రులకు కూడా వీటిపై అవగాహన కలిపించండి..!!

No comments:

Post a Comment