ఇటీవల కాలంలో వింత జననాల గురించి ఎక్కువగా వింటూనే ఉన్నాం... తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో ఓ మహిళ నాలుగు కాళ్ళ శిశువుకు జన్మనిచ్చింది. ఈ వింత శిశివు జననం గురించి తెలిసిన జనం ఆసుపత్రికి క్యూ కట్టారు.. వివరాల్లోకి వెళ్తే...

మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన ఎల్లిమి మణి (25) గురువారం 6.25గం.కు ఈ నాలుగు కాళ్ల శిశువుకు జన్మనిచ్చింది. 1.460కిలోల బరువున్న ఈ శిశువుకు రెండు కాళ్లు, రెండు చేతులతో పాటు అదనంగా రెండు కాళ్లు ఉన్నాయి. శిశువు ఉదర భాగం నుంచి మరో రెండు కాళ్ళు బయటకు వచ్చాయి. నాలుగు కళ్ళతో పుట్టిన ఈ శిశువు ని చూడడానికి జనం క్యూలు కట్టారు.. కాగా జన్యుపరమైన లోపాల వల్లే... ఇటువంటి శారీరక మార్పులు చోటు చేసుకొన్నట్లు చెప్పారు.. అంతేకాదు.. ప్రస్తుతం... ఉదరభాగంలో నుంచి పుట్టుకొచ్చిన కాళ్లను తొలగించడం వైద్యులకు సవాలే అని అన్నారు.. కాగా శిశువు పూర్తిగా కోలుకున్న తర్వాత అదనపు కాళ్లను తొలగిస్తామని పిల్లల వైద్య నిపుణురాలు మాణిక్యాంబ తెలిపారు. ప్రస్తుతం తల్లి-బిడ్డలు క్షేమంగా ఉన్నారు.

No comments:

Post a Comment