రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యమవ్వడానికి క్షణం కూడా పట్టదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే జరగబోతోంది. అక్కినేని నాగార్జున అందరికీ అభిమాన హీరో.. చక్కటి వ్యాపారవేత్తగా ఆయనకు మంచి పేరుంది. యువసామ్రాట్ ఎందరో హీరోలకు ఆదర్శప్రాయం.. ఆయన రూట్‌లోనే వాళ్లూ వ్యాపారాలు ఆరంభిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు.. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న నాగార్జున త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నారన్న వార్త సంచలనం సృష్ఠిస్తోంది.


ఈ ప్రచారం ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల జోరందుకుంది. నాగ్‌‌కు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు. కాంగ్రెస్ పథకాలను ఫ్రీగా ప్రచారం చేశారు కూడా. ఆనాడు నాగార్జున వ్యాపారాలకు వైఎస్ అడ్డుపడలేదు. వైఎస్ జగన్ సన్నిహితులు కొంతమందితో నాగ్ వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉన్నారని కొందరు చెబుతారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున రాజకీయ రంగప్రవేశం చేస్తే గుంటూరు లేదా విజయవాడ సీటు ఆయనకు వైఎస్ జగన్ ఇవ్వొచ్చని వినికిడి. 2019 ఎన్నికల్లో గుంటూరు అయితే బాగుంటుందని రాజకీయ వర్గాల నుంచి నాగ్‌‌కు సూచనలు అందుతున్నాయట.

నాగార్జున ఎన్నికల్లో గెలిస్తే కీలకమైన రాజధాని ప్రాంతంలో, గుంటూరు కారిడార్‌‌లో తన వ్యాపార సామ్రాజ్యం కూడా పెంచుకోవచ్చనేది మరో అంచనా. అయితే ఈ విషయంపై నాగార్జున మాత్రం ఎక్కడా పెదవి విప్పడంలేదు. జగన్ ఆస్తుల జప్తు వ్యవహారంలో ఈడీ సాగుతున్న పోకడ కూడా నాగ్ ఓ కన్నేసి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. మొత్తానికి 2019 ఎన్నికలు ఎవర్ని ఎక్కడ రాజును చేస్తాయనేది అంతుపట్టని ప్రశ్న.. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.

No comments:

Post a Comment