తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృత‌దేహాన్ని మెరీనా బీచ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. జయ సమాధి వద్ద మణిమండపాన్ని నిర్మించనున్నట్టుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ప్రకటించిన నేపథ్యంలో.. అది నిబంధనలకు విరుద్ధం అని, అసలు జయలలిత సమాధే అక్కడ ఉండటానికి వీల్లేదని.. అది నిబంధనలకు విరుద్ధమని ఒక న్యాయవాది చెన్నై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సోమవారం విచారణకు వచ్చింది. అన్నాదురై, ఎంజీ రామచంద్రన్‌ వంటి మహామహుల స్మారకాల సమీపంలో దోషిగా తేలిన జయలలిత సమాధి నిర్మాణం సరికాదని పిటిషనర్‌ వాదించారు. అంతేగాక బీచ్‌ తీరం నుంచి 500 అడుగుల్లో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకూడదని పర్యావరణ శాఖ నిషేధాజ్ఞలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయా కారణాల దృష్ట్యా మణిమండప నిర్మాణ పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని బీచ్‌ నుంచి తొలగించేలా ఆదేశించాలని పిటిషనర్‌ వాదించారు

No comments:

Post a Comment