తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాటల యుద్ధం పెంచారు. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు, సంకేతాల నేపథ్యంలో ఆయనపై సుబ్రహ్మణ్య స్వామి మండిపడుతున్నారు. 
తమిళులు బాగా చదువుకున్న వారని, దీంతో రజనీ రాజకీయాలకు అస్సలు పనికి రారని ఇప్పటికే పలు విమర్శలు చేసిన స్వామి తాజాగా ఆయనపై కొత్తగా విమర్శించడం మొదలుపెట్టారు. రజనీ అవకతవకలకు పాల్పడ్డారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాలకు రావాలన్న ఆకాంక్షను రజనీ మానుకోవాలని చెప్పారు. రజనీకాంత్ ఓ ఫ్రాడ్ అని, అసలు ఆయన రాజకీయాల్లోకి పనికి రారని చెప్పిన ఆయన రజనీ ఆకాంక్షలకు ఆయన పాల్పడిన ఆర్థిక అవకతవకలు అడ్డుపడతాయని చెప్పారు. ఒక వేళ ఆ వివరాలు మొత్తం బయటపడితే రజనీ రాజకీయాల్లో కొనసాగలేరని అన్నారు. మీడియాలో ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు.. ఈ విషయం కాస్త బయటపడితే ఆయన ఇమేజ్ కాస్త పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పారు. మీరు రాజకీయాల్లోకి రాకండి అంటూ రజనీకాంత్ కు హితవు పలికారు. 




అయితే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని బీజేపీ, రాజకీయాల్లోకి రజినీలాంటి మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం చాలా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఆయనను స్వాగతించారు. ఈ నేపథ్యంలోనే స్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చూడాలి మరి ఇలాంటి రాజకీయాలు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో.. ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడానికే సమయం అయిపోతుంది.

No comments:

Post a Comment