Breaking News: గోడను తన్నబోయి గాయపడ్డ సీపీఐ నారాయణ.. ఆస్పత్రిలో చికిత్స

అంటే అన్నారు అంటారు గానీ.. కాలితో తన్నితే గోడ ఎలా బద్దలు అవుతుంది.. మీకు ఆ సలహా ఇచ్చిమ్ది ఎవరు నారాయణ గారు ..?

సీపీఐ నేత నారాయణ సినిమాలో హీరోలా ట్రై చేశారు. కాకపోతే సినిమాలో హీరో గోడను బద్దలు కొడితే.. సీపీఐ నేత నారాయణ కాలితో గోడను కూలగొట్టడానికి ప్రయత్నించారు ఈ ఘటనలో ఆయన కాలికి గాయమైంది..


విశాఖలోని మధురవాడలో అన్యక్రాంతమైన భూములను పరిశీలించేందుకు నారాయణ కార్యకర్తలతో కలిసి వెళ్లారు. అక్కడ అక్రమంగా నిర్మిస్తున్న గోడను కాలితో తన్ని.. కూలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.

No comments:

Post a Comment