నల్లధనంపై సర్జికల్ స్ట్రయిక్స్ జస్ట్, ఇప్పుడే ప్రారంభమైంది..! అసలు నిర్ణయాలు త్వరలో ఉంటాయనీ ప్రధాని మోడీ ప్రకటించాడు కదా…అది ఏకంగా స్థిరాస్తులపై పడనుంది… నిజానికి అవినీతి పరులు, నల్లకుబేరులు తమ ధనాన్ని భూములపై, భవనాలపై, ఇతర స్థిరాస్తులపై పెట్టారనేది బహిరంగ రహస్యం.. ఇప్పుడు ఆ కోటల్ని బద్ధలు కొట్టే ఆలోచనలో ఉన్నాడట….

 అన్ని రకాల స్థిరాస్తుల్ని ‘ఇన్ వాలిడ్’ గా ప్రకటించాలనేది మోడీ ఆలోచనగా చెబుతున్నారు… అంటే చెలామణీలో ఉన్న నగదును ఏరకంగానైతే ‘ఇన్ వాలిడ్’ అని ప్రకటించారో అలాగే ప్రకటిస్తారన్నమాట… అర్థం కాలేదు కదా… వివరంగా చెప్పుకుందాం…. ఈ-ప్రాపర్టీ పాస్ బుక్ లో మీ ఆస్తులు రిజిష్టర్ చేసుకుంటే తప్ప, ఆ ఆస్తుల్ని అమ్మటానికి, కొనటానికి వీల్లేకుండా చేయబోతున్నారు అన్నమాట… ఇంకా వివరంగా చెప్పాలంటే.. EPPB… అంటే ఈ- ప్రాపర్టీ పాస్ బుక్… దీన్ని పాన్ కార్డు,
ఆధార్ కార్డు, ఆన్ లైన్ తో లింక్ చేయబోతున్నారు… యజమాని వ్యక్తిగతంగా తన ఆస్తుల్ని డిక్లేర్ చేయాలి… సబ్ రిజిష్ట్రార్ ఆఫీసుల్లోని స్పెషలాఫీసర్లు మీ ఆస్తుల్ని తనఖీ చేశాక, ఈపీపీబీలో ఎంటరయ్యాక, ఆ ఆస్తులు మీవి అవుతాయి… అంతే… అర్జెంటుగా అమ్మాలనుకునేవాళ్లు, కొనేవాళ్లు, తనఖా పెట్టేవాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయన్నమాట… 2018 మార్చి నెలాఖారుకు ఈపీపీబీలో ఎంటర్ కాని ఆస్తులను ప్రభుత్వం నేరుగా స్వాధీనం చేసుకునేలా ఏకంగా చట్టమే తీసుకురానున్నారట… ఇదండీ నల్ల ఆస్తులపై అసలు సిసలు సర్జికల్ స్ట్రయిక్స్. అయితే, ఇందులో సాధ్యాసాధ్యాలు, పరిమితులపై చాలా సందేహాలున్నాయి…. రిజిస్ట్రేషన్లు గట్రా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి… ఆ ప్రభుత్వాల మార్గదర్శకాలు, నిబంధనలు, చట్టాలను అధిగమించి, అల్టిమేట్ గా కేంద్ర నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా చట్టపరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట…. ఈపీపీబీలో తెలిపిన ఆస్తులే వారివి అనే స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలంటే… ఇప్పుడు నోట్ల చలామణీ రద్దు అని హడావుడిగా నిర్ణయం తీసుకున్నంత సులభం కాకపోవచ్చు… సంకల్పం మంచిదే కానీ ఆచరణ పక్కాగా ఉంటే నిజంగానే అది నల్లధనంపై బ్రహ్మాస్త్రమే కాబోతున్నది… అది మాత్రం నిజం

No comments:

Post a Comment